రైతులకు అకాల కష్టం.. మంత్రి కీలక ఆదేశాలు

అకాల వర్షం పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు..

Update: 2025-03-22 16:20 GMT
రైతులకు అకాల కష్టం.. మంత్రి కీలక ఆదేశాలు
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షపాతం కురుస్తున్న నేపథ్యంలో, వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశించారు. రైతుల సాగు ఉత్పత్తులను తడవకుండా పంటలు నష్టపోకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. శనివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ అన్నదాతలు కూడా ఈ అకాల వర్షాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించి, తమ పంటలను తడిసిపోకుండా భద్రంగా నిల్వ చేసుకోవాలని తెలిపారు. కోతకు వచ్చిన వరి పంటలకు వెంటనే కోయాలని, నిర్లక్ష్యం చేస్తే ఆకాల వర్షాలకు తీరని నష్టం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.

రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న ఆకాల వర్షాలకు మామిడి, వరి పంటలు దెబ్బతిన్నాయి. మెదక్ పట్టణం జంబికుంట వీధిలో ఓ ఇంటిపై పిడుగుపాటు పడటంతో సిద్ధయ్య అనే వ్యక్తి ఇంట్లో సామగ్రి ధ్వంసం అయింది. ఆ సమయంలో మనుషులు ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. కోల్చారాం మండలం పోతంశెట్టి పల్లి వద్ద సుడిగాలి బీభత్సానికి రోడ్డు వెంట ఉన్న చెట్లు కూలిపోయి రోడ్డుకు అంతరాయం కలిగించాయి. కరెంటు పోలు విరిగి పడి ఓ వ్యక్తికి రెండు కాళ్లు విరిగాయి. ఏడుపాయలకు వెళ్లే దారిలో రేకుల షెడ్డు అమాంతం పైకి ఎగిరి ఆగి ఉన్న కారుపై పడింది. అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అదృష్టవశాత్తు తప్పించుకున్నారు. మెదక్ హైదరాబాద్ రోడ్డుపై చెట్టు అడ్డంగా పడడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు చేరుకొని ట్రాఫిక్​ క్లీయర్ చేశారు. నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్​ జిల్లాలో పలుచోట్ల వర్షం పడింది. ధర్పల్లి మండలం వాడి గ్రామంలో వడగళ్ల వాన పడింది. దీంతో వరి ధాన్యం నేలరాలాయి. వడగళ్లవానకు పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి.


Similar News