బీఆర్ఎస్ ధర్నాపై తుమ్మల హాట్ కామెంట్స్

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ విషయంలో ఫెయిల్ అయ్యిందంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం ఆ పార్టీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-10-20 10:53 GMT

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ విషయంలో ఫెయిల్ అయ్యిందంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం ఆ పార్టీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే బీఆర్ఎస్ చేస్తున్న ఈ ధర్నాపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు రైతుబంధు పేరుతో అన్ని పథకాలు అటకెక్కించారని మండి పడ్డారు. పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఎటు చూసినా దోపిడేనని, అందుకే ప్రజలు తమకు అధికారం కట్టబెట్టరాని పేర్కొన్నారు. అధికారం కోల్పోయాక ఇప్పుడు రైతుల తరుపున ధర్నాలు అంటూ సిగ్గులేకుండా నాటకాలు ఆడుతున్నారని తుమ్మల ఫైర్ అయ్యారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వలన ప్రజల్లో తమ ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని ఇలా అబద్దపు ప్రచారాలకు కేటీఆర్ తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.   


Similar News