మహారాష్ట్ర ఎన్నికలపై కాంగ్రెస్ బిగ్ ప్లాన్.. కొత్త స్ట్రాటజీ రెడీ

మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఏఐసీసీ అబ్జర్వర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్కలు వెల్లడించారు...

Update: 2024-10-20 15:51 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదని ఏఐసీసీ అబ్జర్వర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్కలు వెల్లడించారు. ఆదివారం ముంబైలో మహారాష్ట్ర కీలక నేతలతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్కలు మాట్లాడుతూ కాంగ్రెస్ పై పబ్లిక్‌లో పాజిటివ్ వేవ్ ఉన్నదని, బీజేపీకి చెక్ పెట్టాలంటే, మిత్రపక్షాలకు సీట్లు తక్కువ ఇస్తేనే బెటర్ అంటూ ప్రతిపాదించారు. ఏఐసీసీకీ ఇదే వివరిద్దామన్నారు. కాశ్మీర్, హర్యానా పోలింగ్ తీరును పరిగణలోకి తీసుకుంటే, కాంగ్రెస్ మైలేజ్ స్పష్టమవుతుందన్నారు. ఈ మేరకు మిత్ర పార్టీలను కన్విన్స్ చేద్దామని పిలుపు ఇచ్చారు. నేతలంతా తమ అభిప్రాయాలను వెల్లడించాలని కోరారు. ఇదిలా ఉండగా, నవంబర్ లో జరగనున్న మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహలు రచిస్తున్నది. ఇందులో భాగంగానే ఆ పార్టీ సీనియర్లు, అనుభవజ్ఞులైన నేతలను రంగంలోకి దింపింది. కొత్త స్ట్రాటజీతో ఎన్నికల్లోకి వెళ్లాలని ఫిక్స్ అయింది. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన(షిండే) బీజేపీ కూటమిని ఓడించాలని నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర ఇన్‌చార్జీ రమేష్​ చెన్నితాల అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్,భుపేష్ బఘేల్, చరణ్ జిత్ చన్నీ లతో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రులు టీ యస్.సింగ్ దేవ్, పరమేశ్వరన్‌లు తదితరులు పాల్గొన్నారు.


Similar News