కొత్త రేషన్ కార్డుల జారీపై సీఎం రేవంత్ అధికారిక ప్రకటన
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతీష్టాత్మక నిర్ణయాలు తీసుకుంటు ప్రజా పాలనే ధ్యేయంగా ముందుకు సాగుతుంది.
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతీష్టాత్మక నిర్ణయాలు తీసుకుంటు ప్రజా పాలనే ధ్యేయంగా ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే బుధవారం సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలకు సంబంధించిన అభయహస్తం దరఖాస్తు పత్రంను విడుదల చేసింది. ఈ క్రమంలో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలోనే ఓ రిపోర్టర్ రేషన్ కార్డులు లేని వారి ఈ అప్లికేషన్ ఎలా చేసుకుంటారని అడిగారు. దీనికి సీఎం సమాదానంగా రేషన్ కార్డులు అర్హులకు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు. అలాగే అభయహస్తం దరఖాస్తు చేసుకునే వారికి రేషన్ కార్డు లేకపోయినా పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే అప్లికేషన్ గడువు ముగిసిన కూడా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.