తెలంగాణలో ఈ ఏడాది కరోనా తొలి మరణం!
తెలంగాణలో ఈ ఏడాది తొలి కరోనా మరణం నమోదైంది. ఉస్మానియా ఆస్పత్రిలో కరోనా వ్యాధితో చేరిన వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఈ ఏడాది తొలి కరోనా మరణం నమోదైంది. ఉస్మానియా ఆస్పత్రిలో కరోనా వ్యాధితో చేరిన వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన అతనికి కోవిడ్ టెస్టులు జరుపగా కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు సమాచారం. అంతేకాదు.. ఏపీలోని వైజాగ్‌లోనూ ఇవాళ కరోనా మరణం సంభవించినట్లు సమాచారం. కాగా, దేశంలో, తెలంగాణలో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలో దాదాపు 55 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. హైదారాబాద్‌లోనే అత్యధికంగా 44 మంది యాక్టివ్ కేసులు ఉన్నాయని పేర్కొంది.