సెక్రటేరియట్‌ ఉద్యోగుల సమయ పాలనపై ఫోకస్.. ఇకపై ఫేషియల్ టెక్నాలజీతో అటెండెన్స్

సెక్రటేరియట్‌లో పని చేసే ప్రభుత్వ, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమయ పాలనపై ప్రభుత్వం దృష్టి సారించింది.

Update: 2024-11-20 02:33 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : సెక్రటేరియట్‌లో పని చేసే ప్రభుత్వ, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమయ పాలనపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు ఎంప్లాయిస్ హాజరును ఫెషియల్ టెక్నాలజీ ద్వారా నమోదు చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఈ విధానం ఈనెల 22వ తేదీ నుంచి అమల్లోకి రానున్నది. దీనికి సంబంధించి యూవో నోట్ 3124/ఎస్బీ/2023 ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగుల హాజరుపై ఖచ్చితత్వం, సమర్ధత, భద్రత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని దీన్ని అమలు చేయనున్నట్టు సీఎస్ ప్రకటించారు. కింది స్థాయి నుంచి సర్క్యులేటింగ్ ఆఫీసర్ల వరకు ఈ విధానాన్ని ఫాలో కావాల్సిందేనని సీఎస్ ఆదేశాల్లో స్పష్టం చేశారు.


Similar News