Big Alert: టెట్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. దరఖాస్తులకు నేడే లాస్ట్ డేట్
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TG-TET) నోటిఫికేషన్ ఇటీవలే రిలీజైన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TG-TET) నోటిఫికేషన్ ఇటీవలే రిలీజైన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 7న ప్రారంభం కాగా.. నేటితో గడువు ముగియనుంది. అయితే ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోని వారు ఈ రోజు రాత్రి లోగా అధికారిక వెబ్‌సైట్ https://tgtet2024.aptonline.in/tgtet/ ద్వారా ఆన్‌లైన్(Online) విధానంలో అప్లై చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అభ్యర్థులు తమ అప్లికేషన్‌లో పొందుపరిచిన వివరాల్లో ఏవైనా తప్పులుంటే నవంబర్ 22వ తేదీ వరకు ఎడిట్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. అప్లై చేసే టైంలో ఏమైనా సమస్యలు వస్తే 7032901383, 9000756178 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
కాగా నిన్న రాత్రి వరకూ టెట్‌కు 2,07,765 దరఖాస్తులు వచ్చినట్లు సెట్ కన్వీనర్ జి. రమేష్(G. Ramesh) వెల్లడించారు. పేపర్-1కు 61,930 మంది, పేపర్-2కు 1,28,730 మంది, రెండు పేపర్లకు కలిపి 17,104 మంది అప్లై చేసుకున్నారని తెలిపారు. ఇక వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు టెట్ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో జరగనున్నాయి. డిసెంబర్ 26వ తేదీ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రోజుకు రెండు సెషన్లలో పరీక్ష ఉంటుంది. సెషన్-1 పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు, సెషన్-2 పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 5న టెట్ ఫలితాలను ప్రకటిస్తారు.