ఈ రకం వరి ధాన్యం సాగు చేయరాదంటూ.. రైస్ మిల్లర్ల ప్రచారం

వచ్చే ఖరీఫ్ సీజన్లో ఈ రకమైన వరి ధాన్యాన్ని రైతులు సాగు చేయవద్దని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రచారం చేస్తోంది.

Update: 2023-04-08 02:27 GMT

దిశ, కాటారం : వచ్చే ఖరీఫ్ సీజన్లో ఈ రకమైన వరి ధాన్యాన్ని రైతులు సాగు చేయవద్దని భూపాలపల్లి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రచారం చేస్తోంది. ధాన్యం రకాలు 1001, 1121, 1153, 1156, 3291 ఈ రకం విత్తనాలను సాగు చేయరాదని, ఈ ధాన్యం అధిక శాతం నూకలు కలిగి ఉండడం వలన మరియు ఎఫ్ సి ఐ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడం వలన వీటిని రాబోయే వానకాలం సీజన్ నుండి ఎట్టి పరిస్థితుల్లో ఈ రకం విత్తనాలను అందించవద్దని జయశంకర్ భూపాలపల్లి జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రచారం చేస్తున్నారు.

ఇటువంటి రకాలను రాబోవు సీజన్లో రైస్ మిల్లుల వద్ద దిగుమతి చేసుకోమని పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం కేవలం పచ్చి బియ్యం (రా రైస్)మాత్రమే సేకరిస్తున్న కారణంగా అధిక నూక వచ్చి బియ్యం కు అనుకూలంగా ఉండే రకాలు ఎంటీయు 1061, 1064, 1224, 1262, 1271, 1318, 7029, 24423, ఆర్ ఎన్ ఆర్, హెచ్ ఎం టీ, సోనా, బి పి టి,5204, స్వర్ణ రకం వడ్లు మాత్రమే దిగుమతి చేసుకుంటామని రైస్ మిల్లర్లు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ప్రకటించిన కనీసం మద్దతు ధర పొందాలంటే నాణ్యత ప్రమాణాలు పాటించాలని అట్టి దాన్యానికి మాత్రమే తరుగు తీయకుండా దిగుమతి చేసుకుంటామని రైతులు ఆరబెట్టినటువంటి తూర్పార పోసినటువంటి మంచి ధాన్యాన్ని మాత్రమే మిల్లుల వద్దకు తీసుకొని రావాలని రైస్ మిల్లర్స్ విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ ప్రచారం చట్టబద్ధ మేనా?

వ్యవసాయంలో ఎలాంటి రకం విత్తనాలు సాగుచేయాలి పండించాలి నిషేధితమైన రకాలు ఏమున్నాయి అనే విషయంపై వ్యవసాయ శాఖ చేయాల్సిన ప్రచారాన్ని రైస్ మిల్లర్లు ప్రచారం చేస్తుండడం పట్ల ఏ మేరకు చట్టబద్ధత ఉందని రైతులు ప్రశ్నిస్తున్నారు? పైన పేర్కొనబడిన రకాల వరి విత్తనాలను సాగు చేయవద్దని రైస్ మిల్లర్లు ప్రచారం చేస్తుండడంతో రైతులలో అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ విషయమై ప్రభుత్వం, అధికారులు వ్యవసాయ శాఖ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Tags:    

Similar News