ఇదేక్కడి ఇచ్చంత్రం ముచ్చటరా అయ్యా..! ట్రాక్టర్ డ్రైవర్‌కు షాకిచ్చిన పాల్వంచ పోలీసులు (వీడియో వైరల్)

బైక్‌పై వెళ్తున్న వాళ్లు హెల్మెట్ పెట్టుకోకపోతే ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేయడం న్యాయమే.

Update: 2024-04-04 16:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: బైక్‌పై వెళ్తున్న వాళ్లు హెల్మెట్ పెట్టుకోకపోతే ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేయడం న్యాయమే. అదేవిధంగా కారులో వెళ్తున్న వాళ్లు సీటు బెల్టు పెట్టుకోకపోతే ఫైన్ విధించడం ధర్మమే. కానీ, భద్రాది కొత్తగూడెం జిల్లాలో మాత్రం పోలీసులు వెరైటీగా ఓ ట్రాక్టర్ డ్రైవర్‌కు ఫైన్ వేశారు. ఎందుకంటారా.. వాహనాల తనిఖీలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రహదారపై పోలీసులు ఓ ట్రాక్టర్‌ను ఆపారు. వెహికల్‌కు సంబంధించి అన్ని పత్రాలు చూపించాలని ట్రాక్టర్ యాజమానిని ప్రశ్నించగా.. అతడు అన్ని పత్రాలను వారికి చూపించాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. అన్ని ఉన్నాయ్.. సరే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సీటు బెల్టు ఎందుకు పెట్టుకోలేదంటూ పాల్వంచ ఎస్సై ట్రాక్టర్ డ్రైవర్‌కు ఫైన్ వేశాడు.

ఈ క్రమంలోనే బాధితుడు పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అసలు ట్రాక్టర్‌కు సీడు బెల్టు ఉండదంటూ.. మొత్తుకున్నాడు. క్లారిటీ కోసం ట్రాక్టర్ షోరూంకి బాధితుడు ఫోన్ చేయగా అసలు ట్రాక్టర్‌కు సీటు బెల్టు ఉండదని వాళ్లు సమాధానమిచ్చారు. ఈ క్రమంలో బాధితుడు పోలీసులపై ఫైర్ అయ్యాడు. కనీస అవగాహన లేకుండా తనిఖీల పేరుతో వాహనదారులుకు ఫైన్ వేస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇదేక్కడి ఇచ్చంత్రం ముచ్చటరా అయ్యా! అంటూ నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. 

Tags:    

Similar News