Union Budget: కేంద్ర బడ్జెట్‌పై సీపీఐ నారాయణ రియాక్షన్ ఇదే
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో ముఖ్యంగా ఏపీకి రూ. 15 వేల కోట్లు, బీహార్ రూ.41 వేల కోట్ల నిధులు కేటాయింపులు చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో ముఖ్యంగా ఏపీకి రూ. 15 వేల కోట్లు, బీహార్ రూ.41 వేల కోట్ల నిధులు కేటాయింపులు చేశారు. అయితే, ఈ బడ్జెట్ కేటాయింపుల నేపథ్యంలో ఇండియా కూటమి నేతలు బీజేపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కేంద్ర బడ్జెట్‌పై ట్విట్టర్ వేదికగా స్పందించారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ పొలిటికల్ బడ్జెట్ అనడంలో సందేహం లేదన్నారు.
మోడీ ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌లపై చాలా ఆధారపడి ఉందన్నారు. అయితే స్పెషల్ హోదా కోసం వాళ్లిద్దరూ పట్టుబడుతున్నప్పటికీ బీజేపీ సిద్ధంగా లేదని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్యాకేజీలు శాశ్వత పరిష్కారం కాదు.. అని పేర్కొన్నారు.