THIRUMALA: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే?

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. మంగళవారం ఉదయం భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్నప్పటికీ అర్ధరాత్రి వరకు భక్తుల రద్దీ తగ్గింది

Update: 2024-02-14 05:03 GMT

దిశ, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. మంగళవారం ఉదయం భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్నప్పటికీ అర్ధరాత్రి వరకు భక్తుల రద్దీ తగ్గింది. ప్రస్తుతం శ్రీవారి దర్శనం కోసం భక్తులు మూడు కంపార్ట్‌మెంట్‌లలో వేచి చూస్తున్నారు. అదేవిధంగా సర్వ దర్శనం కోసం భక్తులు దాదాపు 12 గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోంది. నిన్న ఒక్కరోజే స్వామి వారిని 68,363 మంది భక్తులు దర్శించుకున్నారు. 19,609 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక హుండీ ఆదాయం రూ.4.55 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.  


Similar News