సీపీఆర్ ప్రక్రియపై విస్తృతమైన అవగాహన ఉండాలి: మంత్రి కేటీఆర్

ఆకస్మాత్తుగా సంభవించే కార్డియాక్ అరెస్ట్ నుంచి ప్రాణాలను కాపాడు కోవాలంటే సీపీఆర్ ప్రక్రియ పై విస్తృతమైన అవగాహన కలిగి ఉండాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

Update: 2023-03-01 16:31 GMT

దిశ ప్రతినిధి, మేడ్చల్: ఆకస్మాత్తుగా సంభవించే కార్డియాక్ అరెస్ట్ నుంచి ప్రాణాలను కాపాడు కోవాలంటే సీపీఆర్ ప్రక్రియ పై విస్తృతమైన అవగాహన కలిగి ఉండాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మేడ్చల్ జీవీకే ఈఎంఆర్ఐ ప్రధాన కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సీపీఆర్ శిక్షణా కార్యక్రమాన్ని ఆయన మంత్రి మల్లారెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో భవిష్యత్ ఉన్న పలువురు యువకులు ఆకస్మాత్తుగా సంభవించే కార్డియాక్ అరెస్టుతో విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని, అలాంటి సందర్భంలో సీపీఆర్ ప్రక్రియ ద్వారా బాధితుల ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు. దీనిపై సిబ్బంది ఆరోగ్య కార్యకర్తలు విస్తృతమైన అవగాహన కలిగి ఉండాలని అందుకు అవసరమైన శిక్షణ పొందాలని సూచించారు. కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ సింగపూర్ రాజు, వైద్య ఆరోగ్యశాఖ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News