తెలంగాణ బీజేపీలో కొత్త ప్రెసిడెంట్‌.. ఎవరు..?

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై సందిగ్ధత నెలకొంది....

Update: 2024-10-14 04:29 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై సందిగ్ధత నెలకొంది. కమలం పార్టీ స్టేట్ చీఫ్ ఎవరనే ప్రశ్న ఇప్పటికే అందరి మెదళ్లను తొలుస్తోంది. ఎవరికి బాధ్యతలు ఇస్తారనే అంశం ఇప్పటికే పార్టీతో పాటు రాజకీయంగానే తీవ్ర ఆసక్తి నెలకొంది. అయితే స్టేట్ చీఫ్ నియామక ప్రక్రియకు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని సమాచారం. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల తర్వాత ఈ ప్రక్రియలో కదలిక వచ్చే చాన్స్ ఉందని విశ్వసనీయ సమాచారం. దేశంలో ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలపైనే కేంద్ర పార్టీ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఈ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశముందని చెబుతున్నారు. పార్టీ ఫోకస్ మొత్తం ప్రస్తుతం ఎన్నికలపైనే ఉండటంతో స్టేట్ చీఫ్ ల ఎంపికపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు.

మరో నెల తర్వాత మహారాష్ట్ర ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ నెలాఖరులో మహారాష్ట్ర పోలింగ్ జరగనుంది. అలాగే వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో జార్ఖండ్ ఎన్నికలు ఉండే చాన్స్ ఉంది. ఆపై వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ ఎన్నికలు జరిగే చాన్స్ ఉంది. నెలల వ్యవధి మాత్రమే ఉండటంతో ఈ రాష్ట్రాల్లో ఎన్నికలపైనే పార్టీ పూర్తిగా దృష్టి కేంద్రీకరించనుంది. ఎన్నికల నేపథ్యంల్నే బీజేపీ జాతీయ అధ్యక్షుడి నియామకం సైతం పెండింగ్ పడింది. జేపీ నడ్డానే నేషనల్ ప్రెసిడెంట్ గా కొనసాగిస్తున్నారు. అలాగే తెలంగాణలో సైతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డినే కంటిన్యూ చేయనున్నారు. ఈ ఎన్నికలు పూర్తయితే స్టేట్ చీఫ్ ఎవరనే అంశంపై క్లారిటీ వచ్చే అవకాశముంది.

తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు కిషన్ రెడ్డి అధ్యక్షతనే జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయన్ను మార్చి కొత్త వారికి బాధ్యతలు ఇస్తే ఇబ్బందులు ఎదురువుతాయనే ఉద్దేశ్యంతో కిషన్ రెడ్డినే కంటిన్యూ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త స్టేట్ చీఫ్ వస్తే సమయం తక్కువగా ఉండి కార్యవర్గం సెట్ అయ్యేందుకు సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో పార్టీ ఎలాంటి మార్పులు చేసే అవకాశాలు లేవని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల నేపథ్యంలో పార్టీ సంస్థాగత వ్యవహారాలు సైడ్ అయిపోయాయి. కొత్త చీఫ్ నియామకం తర్వాత పూర్తిస్థాయిలో వీటిని సెట్ చేసే చాన్స్ ఉంది.

కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలతో పాటు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇటీవల జరిగిన జమ్ము కశ్మీర్ ఎన్నికలకు ఇన్ చార్జీగా బాధ్యతలు నిర్వర్తించి సక్సెస్ అయ్యారు. అధికారంలోకి పార్టీ రాకపోయినా గతంతో మెరుగైన ఫలితాలు సాధించడంలో ఆయన సక్సెస్ అయ్యారు. అయితే అన్ని బాధ్యతలు ఉండటతో స్టేట్ చీఫ్ గా పూర్తిస్థాయిల్ ఫోకస్ పెట్టలేకపోతున్నారు. జమ్ము బాధ్యతల నుంచి రిలీవ్ అవ్వడంతో ఇప్పుడిప్పుడే పార్టీ కార్యకలాపాలపై కిషన్ రెడ్డి ఫోకస్ పెడుతున్నారు. వరుసగా రివ్యూలు చేపడుతున్నారు. ఇటీవల హైడ్రా, మూసీ ప్రక్షాళన అంశాలతో పాటు మెంబర్ షిప్ డ్రైవ్ పై ఆయన సమీక్ష నిర్వహించారు. ఇదిలా ఉండగా పార్టీ స్టేట్ చీఫ్ గా పలువురు నేతలు గంపెడాశలతో ఉన్నారు. ఎవరికి వారు తమకే వస్తుందని ధీమాతో ఉన్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా అధిష్టానం ఎవరికి ఇస్తుందనేది మాత్రం సస్పెన్స్‌గా మారింది. కాంగ్రెస్ బీసీ నాయకుడిని పీసీసీ చీఫ్‌గా నియమించడంతో బీజేపీ సైతం బీసీకే ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీలో కొత్త ప్రెసిడెంట్‌గా పార్టీ ఎవరిని నియమిస్తుందనేది పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది.

Similar News