తెలంగాణకు రెండు కేంద్ర మంత్రి పదవులు.. అనూహ్యంగా తెరపైకి కొత్త పేర్లు..!

లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీఏ కూటమి ఈ నెల 9వ తేదీన కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది.

Update: 2024-06-08 17:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీఏ కూటమి ఈ నెల 9వ తేదీన కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే కేంద్ర కేబినెట్‌ కూర్పుపై బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. ఈ సారి రెండు తెలుగు రాష్ట్రాల నుండి మెజార్టీ స్థానాల్లో ఎంపీలు గెలవడంతో మంత్రి మండలిలో తెలుగు స్టేట్స్‌కు ప్రియారిటి దక్కనుంది. తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి ధీటుగా బీజేపీ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించడంతో సెంట్రల్ కేబినెట్‌లో తెలంగాణకు ప్రాధాన్యత దక్కనుంది. ఈ క్రమంలోనే తెలంగాణకు రెండు కేబినెట్ పదవులు ఇవ్వాలని కాషాయ పార్టీ అధిష్టానం యోచిస్తోనట్లు టాక్. ఇందులో భాగంగానే మల్కాజిగిరి నుండి గెలిచిన ఈటల రాజేందర్, మహబూబ్ నగర్ సీటు నుండి విజయం సాధించిన డీకే అరుణకు కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కనున్నట్లు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి, కరీంనగర్ నుండి రెండో సారి విజయం సాధించిన కీలక నేత బండి సంజయ్‌లకు హై కమాండ్ ఏ పదవి కట్టబెడుతోందని ఆసక్తిగా మారింది. మరీ తెలంగాణ నుండి కేంద్రమంత్రులు పదవులు ఎవరినీ వరిస్తాయో తెలియాలంటే మరో కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Similar News