భారీగా వచ్చిన అప్లికేషన్లు.. పోటీ పడుతున్న మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు
టీఎస్‌పీఎస్‌సీలోని చైర్మన్, మెంబర్ల పోస్టుల కోసం తీవ్ర పోటీ ఏర్పడింది. సుమారు 900 మంది దరఖాస్తు చేసుకున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: టీఎస్‌పీఎస్‌సీలోని చైర్మన్, మెంబర్ల పోస్టుల కోసం తీవ్ర పోటీ ఏర్పడింది. సుమారు 900 మంది దరఖాస్తు చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఫ్రొఫెసర్లు, పొరుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు కూడా అప్లై చేసుకున్నట్లు సమాచారం. మెజార్టీ మంది చైర్మన్‌తో పాటు, మెంబర్ పోస్టులకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని వచ్చాక ఈ దరఖాస్తులను పరిశీలించి ఎంపిక చేయనున్నారు.
ఆశ్చర్య పరుస్తోన్న దరఖాస్తులు
గతంకంటే భిన్నంగా కమిషన్, చైర్మన్, మెంబర్ల పోస్టులకు దరఖాస్తులు భారీగా వచ్చాయి. హైదరాబాద్‌తో పాటు మారుమూల ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో వచ్చాయి. ఇందులో ఎక్కువగా ప్రొఫెసర్లు ఉన్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి నిరాశ చెందిన కీలక లీడర్లు, మాజీ కార్పొరేటర్లు కూడా ఉన్నట్లు సమాచారం. కాగా, మరోవైపు కమిషన్ చైర్మన్, మెంబర్లుగా ఎవరిని ఎంపిక చేయాలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఓ నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతున్నది. బీఆర్ఎస్ హమాంలో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా ఉండాలంటే చైర్మన్‌గా ఓ రిటైర్డ్ ఐపీఎస్‌ను, మెంబర్లుగా ప్రొఫెసర్లను నియమించాలని ఫిక్స్ అయినట్లు సమాచారం. మరి చివరకు ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారో చూడాలి.