రాష్ట్రంలో గురుకులాలను కనుమరుగు చేసే కుట్ర జరుగుతోంది: మాజీ మంత్రి కొప్పుల

రాష్ట్రంలో గురుకుల పాఠశాల వ్యవస్థను కనుమరుగు చేసే కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు.

Update: 2024-08-31 13:52 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో గురుకుల పాఠశాల వ్యవస్థను కనుమరుగు చేసే కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో శనివారం మాజీ ఎంపీ వినోద్ కుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. గురుకుల పాఠశాలలో ఇప్పటి వరకు 34 మంది విద్యార్థులు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. పేద పిల్లలు చనిపోతే సర్కార్‌కు పట్టింపే లేదని మండిపడ్డారు. పాలమాకుల లో పిల్లలు కారం తిండి తినలేక రోడ్డెక్కారు, దీనిపై సీఎం స్పందించి గురుకులాలపై రివ్యూ చేయాలని కోరారు. నాణ్యమైన భోజనం పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు చదువుతున్నారనే నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.

కేసీఆర్ పాలనలో గురుకులాలను దేశంలోనే గొప్పగా తీర్చిదిద్దారని, కాంగ్రెస్ పాలనలో మాత్రం నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్కో విద్యార్థిపై లక్షా 25 వేలు ఖర్చు చేసేవారని, సీఎం రేవంత్ రెడ్డి మాటలు తప్పా.. చేతల్లో చూపడం లేదని మండిపడ్డారు. తెలంగాణలో ఏ ఒక్క వ్యవస్థ సంతృప్తిగా లేదని, అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా? అనే అనుమానం కలుగుతుందన్నారు. గురుకులాలను ప్రభుత్వం కొనసాగింస్తుందా లేదా చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని, వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.


Similar News