ఫంక్టన్‌లు చేస్తే ఎక్సైజ్ నిబంధనలు తప్పనిసరి: మంత్రి పొన్నం ప్రభాకర్

ఫంక్షన్‌లు చేస్తే ఎక్సైజ్ నిబంధనలు తప్పనిసరి అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

Update: 2024-10-28 17:23 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఫంక్షన్‌లు చేస్తే ఎక్సైజ్ నిబంధనలు తప్పనిసరి అని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) పేర్కొన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ..మద్యం పంపిణీ కోసం అనుమతి తప్పనిసరిగా ఉండాలన్నారు. చట్ట ప్రకారం మాత్రమే ఫంకన్లు చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే సహించమని నొక్కి చెప్పారు. బీఆర్ఎస్ నేతలు ఆర్ధికంగా దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారన్నారు. కేటీఆర్ బావమ్మర్ధి ఫామ్ హౌస్‌లో డిస్టబెన్స్ పై ఫిర్యాదు మేరకు పోలీసులు దాడి చేశారన్నారు. విదేశీ మద్యం దొరకగా, కేసు రిజిస్టర్ చేశారన్నారు. తదుపరి జరిపిన పరీక్షల్లో డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిందన్నారు. ఆ తర్వాతనే నార్కోటిక్ డ్రగ్స్ గా కేసుగా నమోదు చేశారన్నారు. తాము రాజకీయంగా ఎవరిపై కేసులు పెట్టాలని నిర్ణయం తీసుకోలేదన్నారు. బండి సంజయ్ పోలీసుల మనోధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటం సరికాదన్నారు.

చట్టాన్న , న్యాయాన్ని పోలీసులు ఎటువంటి విచక్షణ వివక్ష లేకుండా దర్యాప్తు చేయాలని కోరుతున్నానని వివరించారు. ఎన్నికల మేనిఫెస్టో లో పెట్టిన విధంగా కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించిన మేరకు ఫిబ్రవరి 17 కుల గణన సర్వే కోసం శాసనసభలో తీర్మానం చేశామన్నారు. క్యాబినెట్ ఆమోదం తో జీవో నెంబర్ 18 ద్వారా సమగ్ర కుల గణన సర్వే చేయడానికి ప్లానింగ్ కమిషన్ ఆమోదం తెలిపిందన్నారు. భవిష్యత్ లో బలహీన వర్గాలకు ఎస్సీ, ఎస్టీ మైనారిటీ ఈబీసీ లకు ఈ ప్రభుత్వం నుంచి సముచిత న్యాయం లభిస్తుందన్నారు. తాను ,బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా నూతి శ్రీకాంత్ గౌడ్ స్కిల్ డెవలప్మెంట్,ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా కుల వృత్తులు ప్రోత్సహించడానికి కొన్ని కార్యక్రమాలు తీసుకోబోతున్నామన్నారు.


Similar News