Big Alert : ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన దక్షిణ మధ్య రైల్వే

దీపావళి(Diwali) మరియు ఛత్(Chouth) పండుగల నేపధ్యంలో ప్రయాణీకుల భారీ రద్దీని సమర్థవంతంగా నిర్వహించడానికి దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తగిన ఏర్పాట్లు పూర్తి చేసింది.

Update: 2024-10-28 17:27 GMT

దిశ, వెబ్ డెస్క్ : దీపావళి(Diwali) మరియు ఛత్(Chouth) పండుగల నేపధ్యంలో ప్రయాణీకుల భారీ రద్దీని సమర్థవంతంగా నిర్వహించడానికి దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తగిన ఏర్పాట్లు పూర్తి చేసింది. పండుగ, సెలవుల సమయంలో ప్రయాణికుల అదనపు రద్దీకి అనుగుణంగా ముఖ్యమైన మార్గాల్లో 850 ప్రత్యేక రైళ్ల(Special Trains)ను నడపడానికి ఏర్పాట్లు చేసింది. వీటితోపాటు వెయిట్‌లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి అనుకూలంగా ఇప్పటికే ఉన్న రైళ్లకు అదనపు కోచ్‌లు జోడిస్తున్నట్టు ప్రకటించారు. ప్రయాణికులు సాఫీగా టిక్కెట్లను తీసుకోవడానికి అనుకూలంగా ప్రధాన స్టేషన్లలో సాధారణ కౌంటర్లతోపాటు, 14 అదనపు కౌంటర్లను ఏర్పాటు చేసింది. రద్దీగా సమయాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జగరకుండా రైల్వే పోలీసులతో భద్రతా చర్యలు చేపట్టింది.

సికింద్రాబాద్ , హైదరాబాద్, కాచిగూడ , విజయవాడ, గుంటూరు, తిరుపతి వంటి అన్ని ప్రధాన స్టేషన్లలో ప్రత్యేక అధికారులతో ప్రయాణీకుల అవసరాలను పర్యవేక్షించడానికి చర్యలు తీసుకున్నారు. రైళ్లలోని అన్ని రిజర్వ్‌డ్ కోచ్‌లను టిక్కెట్ చెకింగ్ సిబ్బందిని నియమించారు. ప్రయాణీకుల కొరకు స్టేషన్లలోని క్యాటరింగ్ స్టాల్ నిర్వాహకులు అదనపు ఆహార పదార్థాలను ఉంచుకోవాలని ఆదేశించారు. ప్రయాణీకుల భద్రత దృష్ట్యా రైల్వే సిబ్బంది సీసీటీవీల సహాయంతో స్టేషన్ పరిసర ప్రాంతాలను 24 గంటలు పర్యవేక్షించనున్నారు. అంతేకాకుండా ఆర్.పి.ఎఫ్. అధికారులు, పర్యవేక్షక సిబ్బంది ఆకస్మిక తనిఖీలను నిర్వహించడానికి కూడా అన్ని స్టేషన్లలో సిద్ధంగా ఉంటారని రైల్వేశాఖ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది.


Similar News