రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే!.. కాంగ్రెస్ పార్టీ ఆసక్తిక ట్వీట్
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో ప్రధాన పార్టీల సోషల్ మీడియాలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్న విషయం తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో ప్రధాన పార్టీల సోషల్ మీడియాలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్న విషయం తెలిసిందే. మొన్నటివరకు బీఆర్ఎస్ పార్టీ వాళ్లు కాంగ్రెస్ పై విమర్శలు చేస్తే.. కాంగ్రెస్ వాళ్లు దానికి కౌంటర్ గా మరో విమర్శను పోస్ట్ చేస్తూ.. ఇలా ఒకరిపై మరొకరు కౌంటర్లు వేసుకున్నారు. మంగళవారం లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చెరో ఎనిమిది నెగ్గగా.. ఎంఐఎం తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూసిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేక పోయింది.
దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పై మరో విమర్శతో ముందుకు వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ తనకు తానే ఆత్మబలిదానం చేసుకొని బీజేపీకి ఓట్లు వేయించిందని ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ లో పెట్టిన ఓ పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ఈ పోస్ట్ లో బహుబలి సినిమాలో హీరో బాహుబలికి సన్నిహితుడుగా ఉండే కట్టప్ప, బాహుబలిని పోడిచే సన్నివేశానికి సంబందించిన ఫోటో పెట్టి దానిపై కట్టప్పను బీజేపీగా.. బహుబలిని బీఆర్ఎస్ గా ప్రస్థావించింది. దీనిపై రాజకీయాల్లో హత్యలు ఉండవు. ఆత్మహత్యలే. అని ఎక్స్ లో రాసుకొచ్చింది.