వారిలో మూడింట ఒక వంతు మందికి సూసైడ్ థాట్స్
మానసిక ఆందోళన రోజురోజుకి పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది.
దిశ, వెబ్‌డెస్క్: మానసిక ఆందోళన రోజురోజుకి పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. అనేక మంది దీని బారిన పడుతున్నారు. అయితే తాజాగా మానసిక అనారోగ్య బాధితులకు కౌన్సిలింగ్ కోసం ఓ సంస్థ చేపట్టిన సర్వేలో కీలక విషయాలు వెలుగు చూశాయి. వీరి కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ కు గత 18 నెలల్లో సంప్రదించిన వారిలో మూడింట ఒక వంతు మంది కుంగుబాటు, సూసైడ్ ఆలోచనలతో బాధపడుతున్నట్లు తెలిపారని సర్వే చేసిన సంస్థ తెలిపింది.
గత నవంబరు - జనవరి మధ్య ఇటువంటి సంభాషణలు దాదాపు 40 శాతం చోటు చేసుకున్నాయని ది సైరస్ అండ్ ప్రియా వంద్రేవాలా ఫౌండేషన్ తెలిపింది. గతేడాది భారత్ లో హత్యలు, కరోనా వైరస్ ద్వారా చోటు చేసుకున్న మరణాల కన్నా ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వారి సంఖ్యే ఎక్కువని సంస్థను రన్ చేస్తున్న ప్రియా తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఉన్న వైద్య విద్యార్థులందరూ మానసిక వైద్యులుగా మారిన మానసిక ఆరోగ్య సంక్షోభాన్ని పరిష్కరించడానికి సరిపోరని తెలిపారు. ఈ విషయంలో తమను సంప్రదించిన వారిలో 81శాతం తెలంగాణ సహా 12 రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్లు ఆమె తెలిపారు.