ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే ఒకే ఏడాది ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతి.. ఆమె ఎవరు.. ?

ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడమే గొప్పనుకున్న ఈ కాలంలో ఓ యువతి ఏకంగా ఒకే ఏడాది ఆరు ఉద్యోగాలు సాధించి ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలిచింది.

Update: 2024-08-09 13:45 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడమే గొప్పనుకున్న ఈ కాలంలో ఓ యువతి ఏకంగా ఒకే ఏడాది ఆరు ఉద్యోగాలు సాధించి ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలిచింది.ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండ మండలం చిన్నబుగ్గారం గ్రామానికి చెందిన కేతావత్ నిఖిత ఏడాది వ్యవధిలోనే ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు కైవసం చేసుకుంది. అంతే కాదు ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే ఆమె ఆరు ఉద్యోగాలు సంపాదించిడం గమనార్హం. నిఖిత ఇటీవలే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) వెల్లడించిన ఫలితాల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగం సంపాదించింది. అలాగే నిఖిత గ్రూప్ IV ఉద్యోగానికి కూడా ఎంపికైంది. ఇవే కాకుండా ఆమె రెసిడెన్షియల్ స్కూలులో టీచర్‌గా, జూనియర్ లెక్చరర్‌గా, సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌గా, అలాగే  PGT టీచర్‌గానూ ఎంపికై పలువురికి స్ఫూర్తిగా నిలిచింది.

నిఖిత తన పాఠశాల విద్యను మంచిర్యాలలోని ప్రైవేట్ పాఠశాలలో చదివింది. ఆ తరువాత మెదక్‌లోని మోడల్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ , ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి Bed, అదే యూనివర్సిటీ నుండి ఆంగ్లలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన క్రమంలో.. నికిత ఓ మీడియాతో మాట్లాడూతూ.. 'నేను 2023లో నా చదువు పూర్తి అయినా వెంటనే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టాను. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే క్రమంలో ఎలాంటి కోచింగ్ తీసుకోలేదని, యూనివర్సిటీలో ప్రొఫెసర్ కావాలనేది నా లక్ష్యమని' నిఖిత మీడియాతో అన్నారు. ప్రస్తుతం నిఖిత నిర్మల్‌లోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాలలో డిగ్రీ లెక్చరర్ గా పని చేస్తోంది.కాగా.. నిఖిత తండ్రి సర్దార్ సింగ్ కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో AR కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు.నిఖిత ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం పట్ల ఆమె కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Similar News