వర్షాలతో హాజరుకాలేం.. సెలవివ్వండి: హైకోర్టుకు న్యాయవాదుల విజ్ఞప్తి

రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న వాతావరణ పరిస్థితులు, భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కోర్టుల్లో విచారణకు హాజరుకాలేకపోతున్నామని, శుక్రవారం సెలవు ప్రకటించాలని హైకోర్టుకు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు.

Update: 2023-07-20 18:19 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న వాతావరణ పరిస్థితులు, భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కోర్టుల్లో విచారణకు హాజరుకాలేకపోతున్నామని, శుక్రవారం సెలవు ప్రకటించాలని హైకోర్టుకు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తగిన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా రిజిస్ట్రార్‌ను ఆదేశించారు. దీనికి కొనసాగింపుగా రాష్ట్రంలోని అన్ని స్థాయిల కోర్టులకు ఉత్తర్వులు జారీచేశారు. న్యాయవాదుల నుంచి వచ్చిన విజ్ఞప్తి, తదనుగుణమైన పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సంచలన ఉత్తర్వులు (ఆర్డర్స్), ఆబ్సెంట్ అయినందుకు వారెంట్లు లాంటి నిర్ణయాలు వద్దని సూచించారు.

ముందుగానే షెడ్యూలు అయిన ఉన్న కేసుల విచారణకు నిందితులు, లాయర్లు హాజరుకాలేకపోతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పై సూచనలను పాటించాలని పేర్కొన్నారు. అన్ని స్థాయిల్లోని జ్యుడిషియల్ అధికారులు దీన్ని అమలుచేసేలా జడ్జిలు, మేజిస్ట్రేట్‌లు పర్యవేక్షించాలన్నారు. వర్షాల కారణంగా గురువారం జరిగే విచారణలకు సైతం ఇది వర్తిస్తుందని నొక్కిచెప్పారు.

Tags:    

Similar News