బార్లల్లో పెగ్గు విధానానికి స్వస్తి.. ఇక నుంచి 90 ఎంఎల్ నుంచి ఫుల్ వరకు సీసాలు లభ్యం
బార్లలో పెగ్గు విధానానికి స్వస్తి చెబుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
దిశ, వెబ్ డెస్క్: ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తెలంగాణ ప్రభుత్వం ఆదాయమార్గాలపై కన్నేసింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ఆదాయానికి పెట్టనికోటలా ఉన్న మద్యం అమ్మకాలపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇప్పటికే మద్యం అమ్మకాల వేళల్లో మార్పులు తీసుకొచ్చిన ప్రభుత్వం.. తాజాగా బార్ అండ్ రెస్టారెంట్లలో మద్యం అమ్మకాలపై కొన్ని మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటివరకు అమలులో ఉన్న పెగ్గు సిస్టానికి స్వస్తి పలికింది. కస్టమర్లకు ఎంత కావాలంటే అంతా.. ఏ సీసా కావాలంటే ఆ సీసా అందుబాటులోకి వచ్చేలా జీవో తెచ్చింది. దీని ప్రకారం 90 ఎంఎల్ బాటిల్ నుంచి ఫుల్ బాటిళ్ల వరకు కస్టమర్లకు బార్లలో అందుబాటులోకి రానున్నాయి.
ప్రస్తుతం ఈ విధానం వైన్ షాపుల్లో ఉంది. ఇదే విధానాన్ని బార్లకు వర్తింపజేస్తూ తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఈ విధానం వల్ల మద్యం అమ్మకాలు పెరిగి ప్రభుత్వానికి అనుకున్నదానికంటే ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా ఈ విధానంపై కొంతమంది బార్ షాప్ నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 90 ఎంఎల్, క్వార్టర్, హాఫ్ సీసాలు వస్తే ఫుల్ బాటిళ్లు కొనేవారుండరని, దీంతో తమ ఆదాయానికి బ్రేక్ పడుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read..