‘కేసీఆర్ కిట్ ఫుల్.. నగదు మాత్రం నిల్’ అంటూ టీ కాంగ్రెస్ సెటైర్లు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకంపై టీకాంగ్రెస్ స్పందించింది.
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకంపై టీకాంగ్రెస్ స్పందించింది. పథకాన్ని సరిగ్గా అమలు చేయడం లేదంటూ ట్విట్టర్ వేదికగా కేసీఆర్ పై మండిపడింది. ‘కేసీఆర్ కిట్ ఫుల్.. నిధుల్ నిల్’ అంటూ సెటైర్లు వేసింది. ఎన్నికల్లో లబ్ది కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త పథకాలు తీసుకొస్తుందని, నిధుల్లేక వాటిని అటకెక్కిస్తుందని విమర్శలు గుప్పించింది.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరగాలని టార్గెట్లు పెట్టి ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తుందని పేర్కొంది. కేసీఆర్ కిట్ పథకం కింద ఖాళీ కిట్లు ఇస్తున్నారే తప్ప నగదు జమ మాత్రం చేయడం లేదని ఆరోపించింది. రెండేళ్లలో దాదాపు 9 వేల ప్రసవాలు జరిగితే నగదు పొందిన వారు మాత్రం కేవలం 213 మందికి మాత్రమే వచ్చాయని కాంగ్రెస్ పార్టీ తెలిపింది.
కేసీఆర్.. కిట్ ఫుల్ - నగదు నిల్
— Telangana Congress (@INCTelangana) July 9, 2023
ఎన్నికల్లో లబ్ధి కోసం కొత్త పథకాలు..
నిధుల్లేక అటకెక్కిస్తున్న దగా సర్కారు..
ప్రభుత్వ దవాఖనాల్లో ప్రసవాలు జరగాలని టార్గెట్ లు పెట్టి ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లపై ఒత్తిడి తెస్తున్న ప్రభుత్వం. నగదు జమ చేయడంలో మాత్రం అలసత్వం.
రెండేళ్లలో దాదాపుగా 9 వేల… pic.twitter.com/OUYwMIKFkW