భద్రాచలంలో కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక.. లోతట్టు ప్రాంతాలు జలమయం
భద్రాచలంలో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
దిశ, వెబ్‌డెస్క్: భద్రాచలంలో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి నీటిమట్టం పెరగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలం రేగుబల్లి వద్ద రహదారిపైకి వరద చేరింది. భద్రాచలం నుంచి దుమ్ము గూడెం, చర్ల, వాజేడు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి ముంపు మండలాలకు వెళ్లే రహదారులపై వరద నీరు భారీగా చేరింది. కూనవరం, చింతూరు, వీఆర్ పురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలంలోని లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలలోకి వరద నీరు చేరుతోంది. కాలనీల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలిస్తున్నారు.