తీన్మార్ మల్లన్నపై డీజీపీకి ఫిర్యాదు
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్ కుమార్) కులాల మధ్య చిచ్చు పెట్టేలాగా మాట్లాడుతున్నారని.. ఇక నుంచైనా అలాంటి ధోరణి మార్చుకోవాలని రెడ్డి సంఘం స్టేట్ కన్వీనర్ బద్దూరి వెంకటేశ్వరరెడ్డి హెచ్చరించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్ కుమార్) కులాల మధ్య చిచ్చు పెట్టేలాగా మాట్లాడుతున్నారని.. ఇక నుంచైనా అలాంటి ధోరణి మార్చుకోవాలని రెడ్డి సంఘం స్టేట్ కన్వీనర్ బద్దూరి వెంకటేశ్వరరెడ్డి హెచ్చరించారు. వరంగల్‌లో జరిగిన సభలో తీన్మార్ మల్లన్న రెడ్డి కులంపై అసభ్య పదజాలం వాడి అనుచిత వ్యాఖ్యలు చేశారని.. దాంతో మా మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు. అందుకే తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఫిర్యాదు చేసినట్లు బద్దూరి వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.
‘చాయ్ పైసల్ ఇయ్యండి’ అని అడుక్కున్న స్థాయి నుంచి హెలికాప్టర్ ఎక్కే స్థాయికి ఎదిగింది బ్లాక్ మెయిల్ చేస్తూ కాదా? అని ప్రశ్నించారు. అందరినీ కలుపుకుపోయే గుణం రెడ్డి సామాజికవర్గ నేతలకు ఉంటుందని అన్నారు. అనవసరంగా తమపై నిందుల వేయడం సరికాదని తెలిపారు. బీసీల మీద మీకు ఎంత ప్రేమ ఉన్నదో.. అందరికీ తెలుసని సెటైర్ వేశారు. రెడ్డి నేతల సపోర్ట్‌తో ఎమ్మెల్సీగా గెలిచి.. తర్వాత వారిపైనే నిందలు వేయడం, విమర్శలు చేయడం కరెక్ట్ కాదని.. ఇకనైనా ప్రవర్తన మార్చుకోవాలని హితవు పలికారు.