టోల్‌గేట్‌ల వద్ద వాహనాల మోత.. ఆంధ్రాకు క్యూ కట్టిన పట్టణవాసులు
బతుకుదెరువు కోసం ఆంధ్రా నుంచి హైదరాబాద్‌కు జనం సంక్రాంతి పండుగ సందర్భంగా తమ సొంతూళ్లకు పయనం అవుతున్నారు.
దిశ, వెబ్‌డెస్క్ : బతుకుదెరువు కోసం ఆంధ్రా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన జనం సంక్రాంతి పండుగ సందర్భంగా తమ సొంతూళ్లకు పయనం అవుతున్నారు. దీంతో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న టోల్‌ప్లాజాలు కార్లు ఇతర వాహనాలతో రద్దీగా మారాయి. ఈ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఇవాళ మధ్యాహ్నం నుంచి వాహనాల తాకిడి పెరిగింది. పండుగకు పెరిగే ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని జీఎంఆర్ సిబ్బంది విజయవాడ వైపు వెళ్లే.. వాహన లైన్ల సంఖ్య పెంచినా ఏ మాత్రం రద్దీ తగ్గడం లేదు. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. ఫాస్ట్‌ట్యాగ్ ఉన్నప్పటికీ వాహనాలు ఎక్కువగా వస్తుండటంతో నెమ్మదిగా కదులుతున్నాయి. అక్కడే ప్రతి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేసి పంపిస్తుండటంతో మరింత జాప్యం జరుగుతోంది.