Rain Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో తెలంగాణలో పలుచోట్ల మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ...
దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో తెలంగాణలో పలుచోట్ల మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం, శనివారం ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ వరంగల్ జిల్లాలో వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం పడుతున్న సమయంలో చెట్ల కింద, కరెంట్ స్తంభాల పక్కన నిల్చోవద్దని తెలిపింది. పొలం పనులకు వెళ్లే వాళ్లు అప్రమత్తంగా ఉండాలని, పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించారు. భారీ వర్షాలు పడుతున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉంటే మంచిదని స్పష్టం చేశారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండొద్దని తెలిపింది.