తాత్కాలికంగా సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించిన జూడాలు

రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు తమ సమ్మెను తాత్కాలికంగా విరమించారు.

Update: 2024-06-26 03:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు తమ సమ్మెను తాత్కాలికంగా విరమించారు. డీఎంఈ, ఆరోగ్య శాఖ అధికారులతో మంగళవారం అర్ధరాత్రి వరకు జరిగిన చర్చలు సఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో జూనియర్ డాక్టర్లకు వసతి భవనాలకు ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. వసతి భవనాలకు నిధులు విడుదల చేస్తామని సర్కారు హామీ ఇవ్వడంతో జూడాలు దిగొచ్చారు. అలాగే కాకతీయ వర్సిటీలో రోడ్ల మరమ్మతులకు నిధుల మంజూరుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. నేడు రెండు జీవోలు విడుదల చేస్తామని సర్కారు హామీ ఇచ్చింది. జీవోలు విడుదల కాకపోతే రేపు తిరిగి సమ్మెను జూడాలు ప్రారంభించనున్నారు. జిల్లాల్లోని జూడాలను ఇవాళ చర్చలకు వైద్యారోగ్య శాఖ మంత్రి పిలిచారు. అయితే స్టైఫండ్స్, విదార్థుల సమస్యలతో పాటు ఉస్మానియా ఆస్పత్రి భవన నిర్మానం వెంటనే చేపట్టాలనే 8 ప్రధాన డిమాండ్లతో ఈ నెల 24 నుంచి జూడాలు సమ్మె ప్రారంభించిన విషయం తెలిసిందే.


Similar News