బయటకు వెళ్లేవారు జాగ్రత్త.. రేపటి నుంచి పెరగనున్న ఎండ తీవ్రత

ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. ఇంటి నుంచి కాలు బయట పెట్టడానికి ప్రజలు జంకుతున్నారు. ఉదయం తొమ్మిది కాకముందే భాను తన ప్రతాపం చూపెడుతున్నాడు.

Update: 2023-04-20 03:20 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. ఇంటి నుంచి కాలు బయట పెట్టడానికి ప్రజలు జంకుతున్నారు. ఉదయం తొమ్మిది కాకముందే భాను తన ప్రతాపం చూపెడుతున్నాడు. ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.

రేపటి నుంచి విపరీతంగా ఎండలు పెరగనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 41°C నుండి 44°C (డిగ్రీల సెంటీగ్రేడ్) మధ్యన అనేక చోట్ల,  40°C నుండి 42°C ( కొన్ని చోట్ల నమోదు అయ్యే అవకాశం ఉందని వివరించింది. రేపటి నుంచే 4,5 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు, గణనీయంగా తగ్గి అనేక చోట్ల 40°C కన్నా తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

Tags:    

Similar News