ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ వివాదం.. బీఆర్ఎస్‌కు హిందూ సంఘాల హెచ్చరిక!
ఖమ్మంలో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు వివాదాస్పదం అవుతోంది. శ్రీ కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు ఆలోచనను విరమించుకోవాలని హిందూ, యాదవ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: ఖమ్మంలో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు వివాదాస్పదం అవుతోంది. శ్రీ కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు ఆలోచనను విరమించుకోవాలని హిందూ, యాదవ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఇప్పుడీ అంశం తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్భంగా 28 మే 2023న ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని లకారం చెరువులో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఈ విగ్రహాన్ని జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ప్రారంభించాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఓ వైపు విగ్రహం ఏర్పాటుకు పనులు చక చక జరిగిపోతుంటే మరో వైపు వివాదాలు చుట్టుముడుతున్నాయి. శ్రీ కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడం సరికాదని హిందూ, యాదవ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ నేత, సినీ నటి కరాటే కళ్యాణి ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఎన్టీఆర్ విగ్రహం పెడితే అందరికీ సంతోషమే కానీ శ్రీకృష్ణుడి రూపంలో పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారు.
ఈ విగ్రహాన్ని చూసిన భవిష్యత్ తరాలు ఎన్టీఆర్ ను శ్రీకృష్ణుడు అనుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే విగ్రహం ఏర్పాటు వెనుక రాజకీయ కోణం ఉందనే వాదన తెరపైకి వస్తోంది. యాదవ, కమ్మ సామాజిక వర్గాల ఓట్ల కోసమే శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో అన్నగారి విగ్రహం చుట్టూ వివాదం రాజుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయం పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకుంటే ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయనేది పొలిటికల్ సర్కిల్స్ లో ఉత్కంఠగా మారింది.
Also Read.
శిక్ష : హామీలు నెరవేర్చని నాయకుడిని నదిలో ముంచేసిన జనం
ప్రియాంక ‘మిస్ వరల్డ్’ అందుకున్నప్పుడు భర్త వయసు ఎంతో తెలుసా?