రైల్వే స్టేషన్ లో బొగ్గు వ్యాగన్ లో మంటలు.. జగిత్యాల శివారు లింగంపేటలో ఘటన

జగిత్యాల జిల్లా శివారు ప్రాంతం లింగంపేటలోని రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

Update: 2024-08-11 07:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: జగిత్యాల జిల్లా శివారు ప్రాంతం లింగంపేటలోని రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్ర నుంచి కర్ణాటకకు బొగ్గు తరలిస్తుండగా లింగంపేట్ స్టేషన్ లో ఒక్కసారిగా గూడ్స్ రైలు బోగీలో మంటలు వచ్చాయి. ఇది గమనించిన రైల్వే సిబ్బంది మంటలను అదుపు చేశారు. కాగా అప్పటికే ఒక వ్యాగన్ లోని బొగ్గు పూర్తిగా కాలిపోయిందని.. సుమారు ఐదు లక్షల నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. కాగా ప్రమాద సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. మహారాష్ట్ర నుంచి కర్ణాటక కి వెళ్తున్న ఈ గూడ్స్ రైల్లో మొత్తం 3500 టన్నుల బొగ్గు తరలిస్తున్నట్లు తెలుస్తుంది.


Similar News