Cyberabad: నగర ప్రజలకు సీపీ అవినాష్ హెచ్చరిక.. రాత్రి 10 గంటల తర్వాత అలా చేస్తే కఠిన చర్యలు

సైబరాబాద్ సీపీ అవినాష్ మోహంతి (Cyberabad CP Avinash Mohanti) కీలక ప్రకటన చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ (Cyberabad Police Commissionerate) పరిధిలో రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకే క్రాకర్స్ కాల్చుకోవాలని సూచించారు.

Update: 2024-10-31 09:55 GMT

దిశ, వెబ్ డెస్క్: దీపావళి రోజు రాత్రికి ఎన్ని క్రాకర్స్ పేలుతాయో, ఎంత కాలుష్యం కమ్ముకుంటుందో ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఉండే యువత రోడ్లపై బాంబులు పేల్చుతూ తిరుగుతుంటారు. ఈ క్రమంలో సైబరాబాద్ సీపీ అవినాష్ మోహంతి (Cyberabad CP Avinash Mohanty) కీలక ప్రకటన చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ (Cyberabad Police Commissionerate) పరిధిలో రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకే క్రాకర్స్ కాల్చుకోవాలని సూచించారు. ఈ మేరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఆర్డర్స్ వచ్చాయని ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 వరకూ దీపావళి సందర్భంగా ఈ నిబంధనలు ఉంటాయని, ప్రజలు గ్రహించి తమకు సహకరించాలని కోరారు. రాత్రి 8 గంటలకు ముందు గానీ.. 10 గంటల తర్వాత గానీ.. పబ్లిక్ ప్లేసుల్లో, పోలీస్ స్టేషన్ల పరిధిల్లో క్రాకర్స్ పేల్చితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి.. దీపావళిని ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.

Tags:    

Similar News