MOOSI: కేటీఆర్, ఈటల ఒక్కరోజు మాతో కలిసి ఉండండి.. మూసీ వద్ద ఏర్పాట్లు
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ(Moosi) పునరుజ్జీవం ప్రాజెక్టుపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ(Moosi) పునరుజ్జీవం ప్రాజెక్టుపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేటీఆర్(KTRBRS), ఈటల(Eatala Rajendar) మాతో కలిసి ఒకరోజు ఉండాలని మూసీ పరివాహక ప్రజలు(Moosi People) ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోల్లో మూసారాంబాగ్(Moosarambagh) మూసీ పరివాహాక ప్రాంతంలో కూల్చివేతలు చేపట్టిన ఇళ్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్(BRS working) కేటీఆర్, మల్కాజ్ గిరి ఎంపీ(Malkajgiri MP) ఈటల రాజేందర్ ఫోటోలను పెట్టి, వారు ఆ ఇళ్లలో ఉండేందుకు ఏర్పాట్లు చేశారు.
దీనిపై మూసీ పరివాహక ప్రాంతంలో కనీసం ఒక్కరోజైనా తమతో కేటీఆర్ , ఈటల రాజేందర్ ఉండాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. అంతేగాక తమకు ప్రభుత్వం డబుల్ బెడ్రూంలు(Double Bedroom) కేటాయిస్తే స్వచ్ఛందంగా ఇక్కడి ఇళ్లను ఖాళీ చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని, అలాంటప్పుడు ఎందుకు దీనిపై రాజకీయం చేస్తున్నారని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారని తెలుస్తోంది. మూసీ పరివాహక ప్రాంతంలో విపక్ష నేతలు పర్యటనలు చేసిన తర్వాత ఈ విధంగా ఏర్పాట్లు చేయడం ప్రస్తుత రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.