మ్యాట్రీమోనీలో ఫేక్ డిటైల్స్ పెట్టి భార్యను దారుణంగా మోసం చేసిన భర్త

రోజు రోజుకు మ్యాట్రీమోనీ మోసాలు పెరిగిపోతున్నాయి.

Update: 2024-07-12 08:10 GMT

దిశ, ఫీచర్స్: రోజు రోజుకు మ్యాట్రీమోనీ మోసాలు పెరిగిపోతున్నాయి. వాటిలో పెట్టినవి నిజమో ? కాదో తెలుసుకోకుండా పెళ్లిళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. పెళ్లి అయినా తర్వాత అవన్నీ ఫేక్ అని బయటపడుతున్నాయి. దీని వలన చాలా పెళ్లిళ్లు మధ్యలోనే తెగిపోతున్నాయి. తాజాగా అలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది.

ఐఏఎస్‌ అధికారిగా జాబ్ చేస్తున్న అని నమ్మించి మ్యాట్రీమోనీలో ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీని కోసం రెండు కోట్లు కట్నం కూడా తీసుకున్నాడు. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువకుడు మ్యాట్రీమోనీలో ఐఏఎస్‌ను అంటూ తన బయోడేటాలో యాడ్ చేసాడు. ఈ ప్రొఫైల్ కి దీంతో బెల్జియంలో ఉద్యోగం చేస్తున్న ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి అసలు సినిమా స్టార్ట్ అయింది. ఐఏఎస్‌ గా నేను వర్క్ చేయలేకపోతున్న రేడియాలజిస్టుగా ఉద్యోగం చేస్తానని ఆమెను ఒప్పించి వేరే జాబ్ చేసాడు.

మీ జీతం ఏది అని భార్య అడగటంతో చాలా కోట్లు బ్యాంక్ లో ఉన్నాయని నా అకౌంట్ ను సీజ్‌ చేశారని మళ్లీ ఇంకో కథ చెప్పి గేమ్ ఆడాడు అవి బయటకు రావాలంటే అదనంగా రూ.2 కోట్లు చెల్లించాలని చెప్పాడు. ఆమె బంగారం అమ్మి డబ్బులు ఇచ్చింది. ఇక్కడితో ఆగకుండా ఇంకా కట్నం కావాలంటూ ఆమెను వేధించడం మొదలు పెట్టాడు.. ఆమె అప్రమత్తం అయి పోలీసులను ఆశ్రయించి కేసు ఫైల్ చేసింది. అప్పుడు ఈ గుట్టు మొత్తం బయటపడిది. ఈ ఘటన బాచుపల్లిలో చోటుచేసుకుంది.


Similar News