Rythu Bandhu scheme : ‘రైతుబంధు’తో తెలంగాణలో సాగు విప్లవం: మంత్రి

రెండో రోజు రూ.1278.60 కోట్ల రైతుబంధు డబ్బులు 16 లక్షల 98,957 మంది రైతుల ఖాతాలలో జమ అయ్యాయి. రెండు రోజులలో 39,54,138 మంది రైతుల ఖాతాలలో 1921.18 కోట్లు జమ చేసినట్లు ప్రభుత్వం పేర్కొనది.

Update: 2023-06-27 07:18 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రెండో రోజు రూ.1278.60 కోట్ల రైతుబంధు డబ్బులు 16 లక్షల 98,957 మంది రైతుల ఖాతాలలో జమ అయ్యాయి. రెండు రోజులలో 39,54,138 మంది రైతుల ఖాతాలలో 1921.18 కోట్లు జమ చేసినట్లు ప్రభుత్వం పేర్కొనది. 38.42 లక్షల ఎకరాలకు రైతుబంధు చేశారు. రైతుబంధు పథకంతో తెలంగాణలో సాగు విప్లవం కొనసాగుతోందని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. సాగునీటి రాక, ఉచిత కరెంట్‌తో సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరా సాగులోకి వచ్చిందని, వ్యవసాయ రంగం చుట్టూ అల్లుకున్న రంగాలు బలోపేతం అవుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని, ఆహారశుద్ధి పరిశ్రమలతో రూపుమారనున్న తెలంగాణ వ్యవసాయ రంగం అన్నారు.

Read more : ఇంత బతుకు బతికి ఇలాంటి పరిస్థితా.. అధిష్టానం పిలిస్తేనే వచ్చా: జగ్గారెడ్డి

Tags:    

Similar News

టైగర్స్ @ 42..