రాష్ట్రంలో కొత్తగా మరో 13 మండలాలు

రాష్ట్రంలో కొత్తగా మరో 13 మండలాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పాటు చేసిన రెవెన్యూ మండలాలు ఇలా ఉన్నాయి.

Update: 2022-09-27 01:53 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కొత్తగా మరో 13 మండలాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పాటు చేసిన రెవెన్యూ మండలాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల జిల్లాలో ఎండపల్లి , భీమారం, సంగారెడ్డి జిల్లాలో నిజాంపేట, నల్లగొండ జిల్లాలో గట్టుప్పల, మహబూబాబాద్ జిల్లాలో సీరోలు, ఇనుగుర్తి, సిద్దిపేట జిల్లాలో అక్బర్ పేట, భూంపల్లి, కుకునూరుపల్లి, కామారెడ్డి జిల్లాలో డోంగ్లి, మహబూబ్నగర్ జిల్లాలో కౌకుంట్ల, నిజామాబాదు జిల్లాలో ఆలూర్, డొంకేశ్వర్, సాలూరా కేంద్రాలుగా మండలాలను ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ కొత్త మండలాల డిమాండ్ నెలకొంది. వాళ్ల పోరాటానికి ఇంకా ప్రతిఫలం దక్కలేదు. రాష్ట్రంలో జిల్లాలు, డివిజన్లు, మండలాల సంఖ్య పెంచుతున్నారు. కానీ, ఉద్యోగుల క్యాడర్ స్ట్రెంథ్ మాత్రం అలాగే ఉంది. పైగా వీఆర్వోలను ఇతర శాఖలకు పంపారు. వీఆర్ఏల్లోనూ ఎంత మందిని నీటి పారుదల శాఖకు పంపుతారో లెక్క తేలలేదు. మండలాల సంఖ్య పెంచినంత మాత్రాన ఉద్యోగుల సంఖ్య పెరగకుండా మెరుగైన సేవలు ఎలా అందిస్తారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. మెరుగైన సమాజం, పారదర్శకత, వేగవంతమైన సేవలను కొనసాగించాలంటే మానవ వనరులు తగినంత ఉండాలి. అదే లేనప్పుడు కొత్త మండలాలు ఏర్పాటు చేసినా పెద్దగా ఒనగూరే ప్రయోజనం ఏం ఉండదన్న అభిప్రాయం వినిపిస్తున్నది.

Tags:    

Similar News