నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 1540 పోస్టుల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది.
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూ్స్ చెప్పింది. జీహెచ్ఎంసీ పరిధిలో 1540 ఆశా వర్కర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు హెల్త్ సెక్రటరీ రిజ్వి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ (323), మేడ్చల్ (974), రంగారెడ్డి (243) పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా, ఈ పోస్టుల ఎంపిక ప్రక్రియ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా పూర్తి కానున్నది.