రాష్ట్ర వ్యాప్తంగా పుడ్ సేఫ్టీ డ్రైవ్ కొనసాగుతోంది.. కమిషనర్ ఆర్వీ కర్ణన్
రాష్ట్ర వ్యాప్తంగా పుడ్ సేఫ్టీ డ్రైవ్ కొనసాగుతున్నదని కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా పుడ్ సేఫ్టీ డ్రైవ్ కొనసాగుతున్నదని కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఫుడ్ సేఫ్టీలో హైదరాబాద్ చిట్టచివరన ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారాన్ని ఆయన గురువారం ఓ ప్రకటనలో ఖండించారు. 2022 సంవత్సరంలో ఫుడ్ సేఫ్టీకి సంబంధించి నమోదైన కేసుల ఆధారంగా.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2023 డిసెంబర్‌లో నివేదిక విడుదల చేసిందని క్లారిటీ ఇచ్చారు. 2022లో హైదరాబాద్‌లో ఫుడ్ కల్తీపై 246 కేసులు రికార్డు అయ్యాయని వివరించారు. ఇదే విషయాన్ని 2023 చివరలో విడుదలైన ‘క్రైమ్ ఇన్ ఇండియా -2022’నివేదికలో పొందుపరిచారన్నారు. అప్పటి సమాచారంతో, ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుడ్ సేఫ్టీలో హైదరాబాద్ లాస్ట్ అంటూ తప్పుడు ప్రచారం చేయడం సరి కాదన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట పుడ్ సేఫ్టీ విభాగంలో కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన ఫుడ్ అందించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. స్ట్రీట్ వెండర్లకు కూడా ట్రైనింగ్ కార్యక్రమం చేపట్టామని అన్నారు. హాస్పిటల్ క్యాంటీన్లు, హస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలోనూ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నామని తెలిపారు.
హోటళ్ల ఆధారంగా ఆఫీసర్ల సంఖ్య పెంపురాష్ట్ర వ్యాప్తంగా పుడ్ సేఫ్టీ డ్రైవ్ కొనసాగుతోంది.. కమిషనర్ ఆర్వీ కర్ణన్
గత పదేళ్లలో పెరిగిన హోటళ్ల సంఖ్య, జనాభా సంఖ్యకు అనుగుణంగా ఫుడ్ సేఫ్టీ విభాగాన్ని ప్రభుత్వం బలోపేతం చేస్తోందని అన్నారు. హోటళ్లు, జనాభా సంఖ్యకు అనుగుణంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల సంఖ్యను పెంచాలని నిర్ణయించామని పేర్కొన్నారు. నాచారం ఫుడ్ సేఫ్టీ ల్యాబ్‌ను ఆధునీకరించడంతో పాటు, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లో కొత్తగా మరో మూడు ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. కొత్తగా 5 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ అందుబాటులోకి రానునాయని స్పష్టం చేశారు. ఇప్పటికే వాహనాల కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైందని పేర్కొన్నారు. సంవత్సరానికి కనీసం 24 వేల ఫుడ్ సాంపిల్స్ టెస్ట్ చేసేలా ల్యాబ్‌లను అందుబాటులోకి తీసుకురాబోతున్నామని అన్నారు. ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం కలెక్టరేట్లలో స్పెషల్ సెల్ ఏర్పాటు చేస్తున్నామ ఆర్వీ కర్ణణ్ స్పష్టం చేశారు.