మల్లారెడ్డి, మైనంపల్లి కొడుకుల మధ్య ముదురుతున్న గొడవ
మల్లారెడ్డి అగ్రకల్చర్ యూనివర్సిటీలో డిటైండ్ వ్యవహారం క్యాంపస్‌లో కాకపుట్టించింది. విద్యార్థుల ఆందోళనలతో హైటెన్షన్ వాతావరణం క్రియేట్ అయ్యింది.
దిశ, వెబ్‌డెస్క్: మల్లారెడ్డి అగ్రకల్చర్ యూనివర్సిటీలో డిటైండ్ వ్యవహారం క్యాంపస్‌లో కాకపుట్టించింది. విద్యార్థుల ఆందోళనలతో హైటెన్షన్ వాతావరణం క్రియేట్ అయ్యింది. చూస్తుండగానే కళాశాలలోని డిటైండ్ గొడవ రాజకీయరంగు పులుముకుంది. అటు మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి, ఇటు మైనంపల్లి కొడుకు రోహిత్ రావుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇద్దరు నేతలు తొడలు కొట్టి మరీ సవాళ్లు విసురుకున్నారు. అయితే, మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో సోమవారం (మార్చి 18) విద్యార్థులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన చేశారు. విద్యార్థుల చదువు విషయంలో యాజమాన్యానికి శ్రద్ధ లేదని అగ్రికల్చర్ యూనివర్సిటీ ముందు పెద్ద ఎత్తున నినాదాలు దిగారు. విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు ఎమ్మెల్యే రోహిత్, మైనంపల్లి హనుమంత్ రావు కాలేజీకి వచ్చారు.
ఈ వ్యవహారంపై మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డి స్పందించారు. దాదాపు 70 వేల మంది విద్యార్థులు తమ విద్యా సంస్థల్లో చదువుతున్నారని.. వారి భవిష్యత్తు నాశనం చేయొద్దని అన్నారు. మైనంపల్లి కాలేజీ లోపలికి వచ్చి, రౌడీయిజం చేసి విద్యార్థుల జీవితాలను ఇబ్బందులను ఇబ్బందుల్లోకి నెడుతున్నారని అన్నారు. ఉదయం మైనంపల్లి హన్మంత్ రావు యూనివర్సిటీ లోపలకి రావడంపై మాజీ మంత్రి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి, కోడలు ప్రీతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా రాని ఇబ్బంది ఇప్పుడే ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.