డేటా చౌర్యం కేసులో.. మొత్తం సమాచారాన్ని క్లౌడ్‌లో భద్రపరిచినట్టుగా తెలుస్తోంది!
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: డేటా చౌర్యం కేసులో నిందితులు మొత్తం సమాచారాన్ని క్లౌడ్ లో భద్రపరిచినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కేసులను విచారిస్తున్న సైబరాబాద్ సిట్అధికారులు వివరాలు అందచేయాల్సిందిగా గూగుల్‌కు లేఖ రాసినట్టు సమాచారం. వీరి నుంచి సమాచారం వచ్చిన తరువాత గూగుల్, యాహూ ఇలా వేర్వేరు మెయిళ్ల సంస్థలకు లేఖలు రాసి వివరాలు తెప్పించుకుంటే డేటాను ఎవరు లీక్చేశారన్నది బయటపడుతుందని ఓ దర్యాప్త అధికారి వివరించారు. కాగా, ఈ కేసులపై సీరియస్‌గా దృష్టి పెట్టిన కేంద్ర హోంమంత్రిత్వ వ్యవహారాల శాఖ అధికారులు మంగళవారం సిట్అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడినట్టు సమాచారం. దర్యాప్తులో ఇప్పటివరకు వెల్లడైన వివరాల గురించి అడిగినట్టు తెలిసింది.
కొన్ని రోజుల తేడాలోనే సైబరాబాద్ పోలీసులు దాదాపు 83 కోట్ల మందికి సంబంధించిన ఓ గ్యాంగుతోపాటు వినయ్భరద్వాజ్అనే వ్యక్తిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న డేటాలో ఆర్మీ, నేవీ అధికారులు, సిబ్బందితోపాటు పలు కీలక ప్రభుత్వ శాఖల ఉద్యోగుల డేటా ఉండటం సంచలనం సృష్టించింది. ఈ క్రమంలోనే ఆర్మీ, నేవీలకు చెందిన ఇంటెలిజెన్స్వింగ్ల సిబ్బంది కూడా రంగంలోకి దిగాయి. మరోవైపు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ డేటా చౌర్యం కేసులపై సీరియస్‌గా దృష్టిని కేంద్రీకరించింది. దాంతో సిట్అధికారులు కూడా విచారణను ముమ్మరంగా జరుపుతున్నారు. ఓ అధికారితో మాట్లాడినపుడు టెక్నికల్‌గా ఈ కేసును విచారించాల్సి ఉంటుంది కాబట్టి దర్యాప్తు ఆలస్యమవుతుందని చెప్పారు. ఇప్పటివరకు డేటాను ఎవరు లీక్చేశారన్న దానిపై తమకు కొంత స్పష్టత వచ్చిందని చెప్పారు. గూగుల్రిప్లయ్కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిపారు.
ఇప్పటివరకు 21 కంపెనీలకు నోటీసులు జారీ చేయగా ఎనిమిది కంపెనీల ప్రతినిధులు విచారణకు హాజరైనట్టు చెప్పారు. బిగ్బాస్కెట్సంస్థ ప్రతినిధులు తమ డేటా చోరీ అయినట్టు ఒప్పుకున్నారని తెలిపారు. 2020లో బెంగళూరులో కూడా తమ సంస్థకు చెందిన డేటా లీకైందని, కేసులు కూడా నమోదయ్యాయని ఆ సంస్థ ప్రతినిధులు చెప్పారన్నారు. దర్యాప్తులో బిగ్బాస్కెట్నుంచి 3కోట్ల మంది డేటా చౌర్యానికి గురైనట్టుగా వెల్లడైందని వివరించారు. పాలసీ బజార్నుంచి కూడా డేటా చోరీ అయినట్టు తమ విచారణలో ఆధారాలు లభించాయన్నారు. అయితే, ఆ సంస్థ ప్రతినిధులు దీనిని అంగీకరించటం లేదన్నారు. బిగ్‌బాస్కెట్, పాలసీబజార్ సంస్థలకు చెందిన సర్వర్లు హ్యాక్అయ్యాయని తమ దర్యాప్తులో స్పష్టమైందన్నారు.
ఈ డేటా రీస్టోర్అయ్యిందని చెప్పారు. అయితే, ఈ డేటా బయటి వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిందా? వెళితే ఎలా వెళ్లింది? అన్నది నిర్ధారించుకోవాల్సి ఉందని తెలిపారు. హెచ్డీఎఫ్‌సీ బ్యాంకుకు చెందిన డేటా చోరీ అయ్యిందని చెప్పారు. చోరీ చేస్తున్న డేటాను అడ్వర్టయిజ్మెంట్, మార్కెటింగ్ తోపాటు సైబర్మోసాలకు ఎక్కువగా ఉపయోగిస్తున్నట్టు ఆ అధికారి చెప్పారు. నిందితుల నుంచి ఇప్పటివరకు మొత్తం ఇరవైఏడు మంది డేటాను కొన్నట్టు విచారణలో తేలిందన్నారు. మల్టీ నేషనల్కంపెనీలు కూడా నిందితుల నుంచి డేటాను కొంటున్నట్టుగా విచారణలో తెలిసిందన్నారు. ఇలా కొన్న డేటాను ఎక్కువగా బల్క్ఎస్సెమ్మెస్లు పంపేందుకు వాడుతున్నట్టు వివరించారు.
ఇది చాలా పెద్ద బిజినెస్అని చెప్పారు. నిబంధనల ప్రకారం.. బల్క్ ఎస్సెమ్మెస్ ప్రొవైడర్లు ట్రాయ్ నుంచి లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. చాలామంది లైసెన్సులు తీసుకుంటున్నారని చెబుతూ.. వీటిపై ట్రాయ్ పర్యవేక్షణ సరిగ్గా ఉండటం లేదని చెప్పారు. విచారణలో ఒక్క ఎస్సెమ్మెస్ ప్రొవైడర్ రోజుకు దేశవ్యాప్తంగా మూడు కోట్ల మెసేజీలు పంపుతున్నట్టు తేలిందన్నారు. ఒక్కో మెసేజీకి తొమ్మది నుంచి పధ్నాలుగు పైసల వరకు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఆయా బ్యాంకులు రుణాల రికవరీ బాధ్యతలను థర్డ్‌పార్టీలకు ఇస్తున్నాయని, వీరి నుంచి కూడా డేటా లీక్అవుతోందన్నారు. ప్రస్తుతం దేశం మొత్తం మీద 126 సర్వీస్‌ప్రొవైడర్లు ఉన్నట్టు చెప్పారు. తాజాగా పట్టుబడ్డ వినయ్భరద్వాజ్నలుగురికి డేటాను విక్రయించినట్టుగా విచారణలో వెల్లడైందని చెప్పారు.