దశాబ్ధి దగా ప్రోగ్రామ్​సక్సెస్​.. టీపీసీసీ నాయకుల ఆగ్రహం

రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్​పార్టీ చేపట్టిన ‘దశాబ్ధి దగ’ ప్రోగ్రామ్​సక్సెస్​అయింది. అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం అయ్యాయి.

Update: 2023-06-22 14:23 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్​పార్టీ చేపట్టిన ‘దశాబ్ధి దగ’ ప్రోగ్రామ్​ సక్సెస్​ అయింది. అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం అయ్యాయి. కేజీ నుంచి పీజీ ఉచిత నిర్బంధ విద్య, ఫీజు రీయింబర్స్ మెంట్, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, పేదలకు డబుల్​బెడ్​ రూమ్​ఇళ్లు, దళిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమి, పోడు భూములకు పట్టాలు, రైతు రుణ మాఫీ, ముస్లీం, గిరిజన 12 శాతం రిజర్వేషన్ల వైఫల్యాలను నిరసిస్తూ జిల్లాల వారీగా ఆందోళనలు జరిగాయి.

అనంతరం ఎమ్మార్వో, ఆర్డీవోలకు వినతి పత్రాలను అందజేశారు.కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ప్రధానమైన పది హామీలను నెరవేర్చలేదని పది తలల కేసీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. అయితే కొన్ని జిల్లాల్లో కీలక నాయకులందరినీ ముందస్తుగా అరెస్టులు చేసినా...క్షేత్రస్థాయి కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని సక్సెస్​చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక నిర్ణయాలను తిప్పికొడతామని టీపీసీసీ నాయకులు హెచ్చరించారు.

Tags:    

Similar News