Raj Pakalaకు హైకోర్టులో ఊరట.. పోలీసులకు కీలక ఆదేశాలు

జన్వాడ ఫామ్‌హౌజ్(Janwada Farmhouse) కేసులో రాజ్ పాకాల(Raj Pakala) కు హైకోర్టులో (High Court) ఊరట లభించింది.

Update: 2024-10-28 11:07 GMT

దిశ, వెబ్ డెస్క్: జన్వాడ ఫామ్‌హౌజ్(Janwada Farmhouse) కేసులో రాజ్ పాకాల(Raj Pakala) కు హైకోర్టులో (High Court) ఊరట లభించింది. శనివారం రాత్రి జన్వాడలోని ఓ ఫామ్ హౌజ్‌లో పార్టీ జరగ్గా అందులో అనుమతి లేకుండా విదేశి మధ్యంతో పాటు క్యాషినో‌కు సంబంధించిన వస్తువులు లభ్యం అయ్యాయి. దీంతో అనుమతి లేకుండా పార్టీ నిర్వహించినందుకు పోలీసులు రాజ్ పాకాల(Raj Pakala), విజయ్ పాకాల పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే రాజ్ పాకాల పోలీసులకు చిక్కకుండా వెళ్లిపోవడంతో అతని ఇంటిని పరిశీలించిన తర్వాత.. విచారణకు హాజరు కావాలని మోకిలా పోలీసులు (Mokila Police) నోటీసులు జారీ చేశారు. కాగా ఈ నోటీసులపై స్పందించిన ఆయన విచారణకు హాజరయ్యేందుకు రెండ్రోజుల గడువు ఇవ్వాలని పోలీసులకు లేఖ రాశారు. అలాగే తనను అరెస్ట్ చేస్తారనే సమాచారంతో హైకోర్టు (High Court) లో రాజ్ పాకాల లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు.. రాజ్‌పాకాలకు 2 రోజుల సమయం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే విచారణలో ఆధారాలు లభిస్తే చర్యలు తీసుకుంటామన్న ఏఏజీ నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లాలని హైకోర్టు రాజ్ పాకాల కు సూచించింది. ఏది ఏమైనప్పటికి హైకోర్టు నిర్ణయంతో రాజ్ పాకాల కు ఊరట లభించింది.

Read More..

Raj Pakala: రెండ్రోజులు టైమ్ ఇవ్వండి.. మోకిలా పోలీసులకు కేటీఆర్ బామ్మర్ది రిక్వెస్ట్ 


Similar News