సెప్టెంబర్ 17thపై కేంద్రం సంచలన నిర్ణయం.. అధికారిక ఉత్తర్వులు జారీ

సెప్టెంబర్ 17పై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17ను హైదరాబాద్ విముక్తి దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది.

Update: 2024-03-12 17:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: సెప్టెంబర్ 17thపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17ను హైదరాబాద్ విముక్తి దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం రాత్రి అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, గతేడాది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సెప్టెంబర్ 17th రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ జాతీయ సమైక్యతా దినంగా, బీజేపీ తెలంగాణ విమోచనా దినోత్సవంగా నిర్వహించింది. ఎవరికి వారు అధికారికంగా నిర్వహించి జెండా ఆవిష్కరించారు. అయితే, రెండ్రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో సెప్టెంబర్ 17thపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోవడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంతేగాకుండా.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తున్న వేళ కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News