తెలంగాణ నెక్స్ట్ హోంమంత్రి నేనే.. ఆ తర్వాత సీఎం: ఎన్నికలకు ముందే BRS మంత్రి హల్ చల్

అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వస్తుందోననే అంశంపై క్లారిటీ లేదు. ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు వేటికవే పవర్‌లోకి వస్తామని పోటీ పడి ప్రకటనలు

Update: 2023-07-28 02:04 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వస్తుందోననే అంశంపై క్లారిటీ లేదు. ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు వేటికవే పవర్‌లోకి వస్తామని పోటీ పడి ప్రకటనలు చేస్తున్నాయి. కానీ ఓ మంత్రి మాత్రం వచ్చే ఎన్నికల్లో తమ పార్టీనే గెలుస్తుందని, తనకే హోం మంత్రి పోర్టుఫోలియో ఇస్తారని అనుచరులకు ధీమాగా చెప్తున్నారు. అంతే కాదు తన కల సీఎం చైర్‌లో కూర్చోవడమని, అది ఎప్పటికైనా నిజం అవుతుందని బలంగా చెప్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది.

ప్రగతిభవన్‌కు చాలా క్లోజ్

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి తరుచుగా తన సన్నిహితులకు చెప్తోన్న విషయాలు గులాబీ పార్టీలో హాట్ టాపిక్‌గా మారాయి. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, తను హోం మంత్రి అవుతానని బలంగా చెప్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తర్వాత పార్టీలో తనకే ప్రాధాన్యత ఉంటుందని ధీమాగా ఉన్నారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్, కేటీఆర్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అయితే కొన్ని కారణాలతో తొలి ప్రభుత్వంలో మంత్రి పదవి రాలేదని, 2018లో మంత్రి పదవి ఇచ్చినట్టు తన అనుభవాలను వివరిస్తున్నారని టాక్ ఉంది.

తన టార్గెట్ సీఎం పదవి

వచ్చే ఎన్నికల తర్వాత హోం మంత్రి పదవి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తోన్న సదరు మంత్రి తన టార్గెట్ సీఎం చైర్‌లో కూర్చోవడమేనని సందర్భం వచ్చిన ప్రతిసారి సన్నిహితులకు చెప్తుంటారనే టాక్ ఉంది. రాజకీయాల్లో రిటైర్ అయ్యేలోపు ఎప్పుడో ఒకసారి కచ్చితంగా సీఎం అవుతానని ధీమాగా చెప్తున్నారు. తమ సామాజిక వర్గం నుంచి తొలి సీఎంగా బాధ్యతలు చేపట్టి చరిత్రలో నిలిచిపోతానని సదరు మంత్రి నమ్మకంతో ఉన్నారు.


Similar News