అందుకే కాంగ్రెస్ యూటర్న్.. KTR ఆసక్తికర ట్వీట్

అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య కృష్ణా జలాల ఇష్యూ అగ్గి రాజేసింది.

Update: 2024-02-12 04:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య కృష్ణా జలాల ఇష్యూ అగ్గి రాజేసింది. కృష్ణా జలాలను కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించనుందని బీఆర్ఎస్ చెబుతూ వస్తోంది. అయితే అసెంబ్లీ సమావేశాల్లో కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.

‘ఛలో నల్గొండ ఎఫెక్ట్! కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పచెప్పడానికి నిరసనగా రేపు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన 'ఛలో నల్గొండ' సభ సృష్టించిన ఒత్తిడి వల్ల.. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించట్లేమని నేడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే ప్రతిపక్ష హోదాలో బీఆర్ఎస్ సాధించిన తొలి విజయం’ అంటూ ట్వీట్ చేశారు.


Similar News