TGSRTC: హైదరాబాద్-విజయవాడ రూట్లో స్తంభించిన రాకపోకలు.. టీజీఎస్ ఆర్టీసీ కీలక ప్రకటన

రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది.

Update: 2024-09-02 06:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు పొంగిపొర్లుతుండటంతో ప్రధాన రహాదారులు జలమయమయ్యాయి. చిల్లకల్లు నందిగామ వద్ద జాతీయ రహదారి-65పై వరద నీరు పొంగిపొర్లడంతో రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఈ క్రమంలోనే టీజీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తే 560కి పైగా బస్సులను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. రద్దైన బస్సుల్లో ఖమ్మం జిల్లాలో 160, వరంగల్ 150, రంగారెడ్డి జిల్లాలో 70కిపైగా ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని టీజీఎస్ ఆర్టీసీ అధికారులు తెలిపారు.   


Similar News