రేపే గ్రూప్-1 ప్రిలిమ్స్.. TGSRTC కీలక ప్రకటన

గ్రూపు-1 ప్రిలిమ్స్ పరీక్షకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. గతంలో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా ఈసారి పకడ్బందీగా ప్లాన్ చేసింది.

Update: 2024-06-08 14:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: గ్రూపు-1 ప్రిలిమ్స్ పరీక్షకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. గతంలో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా ఈసారి పకడ్బందీగా ప్లాన్ చేసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు ఆదివారం జరగనున్నాయి. మొత్తం 563 పోస్టుల భర్తీ కోసం జరుగుతున్న ఈ పరీక్షలకు దాదాపు 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లాల్లో 897 ఎగ్జామ్ సెంటర్లను సిద్ధం చేశారు. ప్రతీ కేంద్రంలో ఒక సిట్టింగ్ స్క్వాడ్ ఉంటుందని, ప్రతీ ఐదు సెంటర్లకు ఒక ఫ్లైయింగ్ స్క్వాడ్ ఉంటుందని తెలిపింది.

గ్రూప్‌-1 ప్రిలిమనరీ పరీక్ష రాసే అభ్యర్థులకు TGSRTC కీలక సూచనలు చేసింది. రవాణా పరంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఈ మేరకు టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేసి వెల్లడించారు. TGSRTC ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 897 పరీక్షా కేంద్రాలకు బస్సులు నడపనున్నట్లు తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అధిక బస్సులు కేటాయించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రధాన బస్‌ స్టేషన్లలో ‘May I Help You’ కౌంటర్లను సంస్థ ఏర్పాటు చేసింది. అక్కడ పరీక్షా కేంద్రాల సమాచారాన్ని అభ్యర్థులకు ఇవ్వడంతో పాటు ఏ బస్సులో వెళ్లాలో అధికారులు చెప్తారని వెల్లడించారు.


Similar News