TGSRTC: సంబరపడి బ్యాలెన్స్ చెక్ చేస్తే, మీ ఖాతా గుల్ల.. వీసీ సజ్జనార్ హెచ్చరిక

టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సైబర్ మోసాలపై ప్రజలకు ఎప్పుడూ అవగాహన కల్పిస్తుంటారు.

Update: 2025-01-10 02:56 GMT

దిశ, వెబ్ డెస్క్: టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్(TGSRTC MD VC sajjanar) సైబర్ మోసాలపై(Cyber Crimes) ప్రజలకు ఎప్పుడూ అవగాహన కల్పిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో జంప్‌డ్ డిపాజిట్ స్కామ్(Jumped Deposit Scam) తో జాగ్రత్త! అని హెచ్చరించారు. ఈ సందర్భంగా.. ఈ స్కామ్ కి సంబంధించి అవగాహన కల్పించే ఓ వీడియోను పోస్ట్ చేశారు. దీనిపై ఆయన.. అజ్ఞాత వ్యక్తుల నుంచి యూపీఐ(UPI) నుంచి మీ ఖాతాలోకి డబ్బులు వస్తే తెగ సంబరపడిపోకండి అని అన్నారు. ఆత్రుతగా బ్యాలెన్స్ చెక్ చేసేందుకు పిన్ ఎంటర్ చేశారో.. అంతే.. మీ ఖాతా గుల్ల అవుతుంది అని తెలిపారు. బ్యాలెన్స్ చెక్ చేసే సమయంలోనే యూపీఐ ఐడీలకు పేమెంట్స్ లింక్ లను పంపి సైబర్ నేరగాళ్లు దోచేస్తేన్నారని, ఇలాంటి ఫేక్ పేమెంట్స్ లింక్స్ కి స్పందించొద్దు అని చెప్పారు. అంతేగాక మోసానికి గురైతే వెంటనే 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సజ్జనార్ సూచించారు.

Tags:    

Similar News