TGSRTC: ప్రయాణికులకు భారీ గుడ్‌న్యూస్.. టీజీఎస్ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది.

Update: 2024-07-29 08:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. ఈ ఎఫెక్ట్‌తో బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య విపరీతంగా పెరగింది. ఈ క్రమంలో ప్రయాణికుల మధ్య గొడవలు తలెత్తుతున్నాయి. మరోవైపు కండక్టర్లు, డ్రైవర్లపై ప్యాసింజర్లు భౌతికదాడులకు తెగబడుతున్నారు. ఇక పాఠశాలలకు విద్యార్థులు, టికెట్ కొనుగోలు చేసి ప్రయాణించే పురుషులకు సీట్లు దొరక్క అష్టకష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలో అన్ని వర్గాల ప్రయాణికుల తాకడి తట్టుకుని మెరుగైన సేవలు అందించేందు టీజీఎస్ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని కొత్త బస్సు సర్వీసులను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ మేరకు కొత్త బస్సుల విషయంలో టీజీఎస్ఆర్టీసీ అభ్యర్థన మేరకు ఈ ఏడాది జూన్ నాటికి 1,325 కొత్త బస్సులను రోడ్లపైకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలను రచిస్తోంది. ఆ సర్వీసుల్లో 712 పల్లె వెలుగులు, 400 ఎక్స్‌ప్రెస్, 75 డీలక్స్, 138 లహరి, రాజధాని బస్సులు ఉన్నాయని టీజీఎస్ ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. మొత్తం 1,325  కొత్త బస్సులకు గాను కొత్తగా కొలువుదీరిని ప్రభుత్వం 100 బస్సులను ప్రారంభించింది. అందులో ‘లహరీ’ పేరుతో 16 స్లీపర్ కోచ్ బస్సులు ఇప్పటికే రొడ్డెక్కాయి. వాటితో పాటు మరికొన్ని కొత్త బస్సులు బయటకు రానున్నాయి.

Tags:    

Similar News